సౌదీ:ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని GACA సూచన
- September 17, 2020
రియాద్:ఇతర దేశాల నుంచి సౌదీ అరేబియాకు వచ్చే ప్రయాణికులు, అదేవిధంగా సౌదీ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఖచ్చితంగా కరోనా ముందస్తు జాగ్రత్త చర్యలను పాటించాలని పౌర విమానయాన సాధారణ విభాగం అధికారులు వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై తాత్కాలికంగా నిషేధం నుంచి సౌదీలకు, ప్రవాసీయులకు మినహాయింపు ఇవ్వాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కింగ్డమ్ లోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైన మరుసటి రోజునే ప్రయాణికులకు జీఏసీఏ పలు సూచనలు చేసింది. కింగ్డమ్ లోకి ఎంటరైన ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మూడు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని తెలిపింది. సౌదీ చేరుకున్న 48 గంటల తర్వాత మరోసారి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం ద్వారా తాము కోవిడ్ బారిన పడలేదని నిరూపించుకోవాలి. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ప్రయాణికులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని, ప్రభుత్వ సూచనల విధిగా పాటించాలని అధికారులు కోరారు. అదేసమయంలో సౌదీ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఆయా దేశాలు ప్రకటించిన మార్గనిర్దేశకాల మేరకు అనుసరించాలని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







