రజనీ రాజకీయ ప్రవేశం షురూ..

- September 17, 2020 , by Maagulf
రజనీ రాజకీయ ప్రవేశం షురూ..

చెన్నై:తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే అంశానికి తెరపడినట్లైంది ప్రస్తుత అంశాలు పరిశీలిస్తుంటే. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీచేయడానికి సిద్దపడుతున్నారు. ఈలోగా ఆయన గెలిచేందుకు అవకాశం ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో సర్వే చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు. లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన రజనీ రెండు సినిమాలు చిత్రీకరణకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయాలని రజనీ అభిమానులు, మక్కల్ మండ్రం పోస్టర్లు అంటించి సంచలనం సృష్టిస్తున్నారు. తాను రాజకీయ ప్రవేశం చేయనున్న శుభముహూర్తం గురించి వారికి రజనీ తెలిపారు. మక్కల్ మండ్రం నాయకుల సమాచారం ప్రకారం రజనీ నవంబర్‌లో రాజకీయ పార్టీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మధురై లేదా వేలూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ పేరును ప్రకటించే ఆలోచనలో రజనీ ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com