పర్యాటక రంగాన్ని చక్కదిద్దే చర్యలపై దృష్టి సారించిన బహ్రెయిన్
- September 17, 2020
బహ్రెయిన్: కోవిడ్ ధాటికి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్న పర్యాటక రంగాన్ని గాడిన పడేసేందుకు ఉన్న అవకాశాలపై బహ్రెయిన్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ పర్యాటక సంస్థ 112వ సమావేశంలో పర్యాటక రంగానికి సంబంధించి పలు అంశాలను చర్చించారు. బహ్రెయిన్ పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక మంత్రితో పాటు పర్యాటక, ఎగ్జిబిషన్ అధారిటీ(BTEA) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తబ్లిషి తీర్మానంలో భాగమైన పర్యాటక రంగం పునురుద్ధణతో పాటు ఏయే రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కోవిడ్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటూనే పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే మార్గాలపై సమీక్షించారు. ఇదిలాఉంటే దేశీయంగానే కాకుండా మధ్య ప్రాచ్యంలో పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడే చర్యలు చేపట్టడంతో బహ్రెయిన్ ను గతేడాది UNWTOలో సభ్య దేశంగా చేర్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







