షార్జా: విస్తుపోయేలా మితిమీరుతున్న వేగం..రాడార్ లో 278కి.మీ. వేగం నమోదు

- September 17, 2020 , by Maagulf
షార్జా: విస్తుపోయేలా మితిమీరుతున్న వేగం..రాడార్ లో 278కి.మీ. వేగం నమోదు

షర్జాలోని వాహనదారుల మితిమీరిన వేగం విస్తుగొలిపేలా ఉంటున్నాయి. 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన రోడ్లపై ఏకంగా 200 కిలోమీటర్ల వేగం దాటి ప్రమాదకరంగా వహనాలను నడుపుతున్నారు. వేగ పరిమితికి సంబంధించి ఈ ఏడాది తొలి 8 నెలల్లోనే 274 ఉల్లంఘనలు స్పీడ్ రాడార్ లో నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉల్లంఘనలు అన్ని జనవరి 1 నుంచి ఆగస్ట్ 31 మధ్య నమోదయ్యాయని వివరించారు. ఇక ఇటీవలె ఓ వహనదారుడు 80 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఉన్న రహదారిలో ఏకంగా 278 కిలోమీటర్లు వేగంతో దూసుకుపోయినట్లు రాడార్ లో నమోదైందని తెలిపారు.  హద్దుమీరి వేగం అత్యంత ప్రమాదకరమని..అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. షార్జాలోని పలు ప్రాంతాల్లోని స్పీడ్ రాడార్స్...స్పీడ్ లిమిట్ దాటిన వాహనాలను గుర్తిస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. 80 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ విధించిన రహదారిలో అంతకుమించి వేగంగా వెళ్లిన వాహనదారుడికి Dh3000జరిమానాతో పాటు 23 బ్లాక్ పాయింట్స్ విధిస్తామని, రెండు నెలల పాటు వాహనాన్ని జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇక 60 కిలోమీటర్ల వేగ పరిమితిని దాటిన వాహనదారులకు Dh2000 జరిమానా, 12 బ్లాక్ పాయింట్లతో పాటు నెల రోజులు వాహనాన్ని జప్తు చేస్తామన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com