గల్ఫ్ దేశాల్లో బిజెపి తెలంగాణ NRI సెల్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

- September 18, 2020 , by Maagulf
గల్ఫ్ దేశాల్లో బిజెపి తెలంగాణ NRI సెల్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

గల్ఫ్:మన ప్రియతమ నేత, భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం పురస్కరించుకుని  గల్ఫ్ దేశాలైన ఒమాన్, యూఏఈ,ఖతార్,కువైట్ మరియు బహ్రెయిన్ శాఖల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు కరోన నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ  నిర్వహించినట్టు మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు తెలిపారు.మిడిల్ ఈస్ట్ చైర్మన్ తోపాలి శ్రీనివాస్  మరియు మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు సూచనతో మిడిల్ ఈస్ట్ దేశాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఒమాన్ లో
ఒమాన్ కన్వీనర్ మంచికట్ల కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకల్లో బిజెపి ముఖ్య నాయకులు మామిడి శ్యాం, మురళి నడ్లపాటి, సాయి కుమార్ నిడిమోలు, అల్లే గంగాధర్, చెని గురువయ్య,సమంతి గంగాధర్ పాల్గొన్నారు.


ఖతర్ లో
ఖతర్ కన్వీనర్ విలాసాగరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు ,శివప్రసాద్,సత్యనారాయణ ,నాంపెళ్ళి,బాలయ్య,రాజశేఖర్ .రాజయ్య,కిరణ్ ,రేడ్డి పాల్గొన్నారు.

కువైట్ లో
కువైట్ కో-ఆర్డినేటర్ క్యాతం రమేష్ ఆధ్వర్యంలో కేకు కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో  ప్రణయ్,భాస్కర్ కుమార్,సాయి, వాసు, కనకయ్య, శరత్, సురేందర్, ప్రవీణ్. ప్రబుదాస్, సురేష్,రాజు,రాజేష్,శేఖర్,ప్రవీణ్, అశోక్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com