షార్జాలో 3 రోజుల పాటు ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్..లాక్ డౌన్ తర్వాత ఇదే తొలి ఎక్స్ పో

- September 18, 2020 , by Maagulf
షార్జాలో 3 రోజుల పాటు ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్..లాక్ డౌన్ తర్వాత ఇదే తొలి ఎక్స్ పో

షార్జా:లాక్ డౌన్ తర్వాత సాధారణ జనజీవనం దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా షార్జాలో భారీ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. షార్జా ఎక్స్ పో సెంటర్ వేదికగా మూడ్రోజుల పాటు ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. వ్యాపార కార్యకలాపాలు మళ్లీ పుంజుకునేలా ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్స్, ఇతర ఈవెంట్లు ఏర్పాటు చేయాలన్న షార్జా ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ నిర్ణయాలకు అనుగుణంగా సమర్ధవంతమైన అధికారుల పర్యవేక్షణలో ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. సందర్శకులకు ఆరోగ్య భద్రత కోసం కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా  అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం ప్రారంభమైన ఎలక్ట్రానిక్స్ ఎక్స్ పో శనివారం ముగియనుంది. ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు ఇదొక మంచి వేదికని ఎక్స్ పో సెంటర్ నిర్వాహకులు అంటున్నారు. అదే సమయంలో వినియోగదారులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని..ప్రపంచ శ్రేణి బ్రాండ్లు కూడా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. కిచెన్ రీస్టైల్ చేయాలనుకునే కుటుంబాలకు ఎక్స్ పో మంచి వేదిక అవుతుందన్నారు. ఇదిలాఉంటే..ఎక్స్ పోకి వచ్చే సందర్శకుల ఆరోగ్య భద్రతకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, బిల్డింగ్ లోని ప్రతి హాల్ ను స్టెరిలైజ్ చేశామని, అలాగే ప్రతి ఒక్కరి టెంపరేచర్ చూశాకే లోనికి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. ఎగ్జిబిషన్ హాల్ లో కూడా థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. సందర్శకులు భౌతిక దూరం పాటించేలా ఎక్కువ ప్రాంతాన్ని ఖాళీగా వదిలినట్లు నిర్వాహకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com