భారత్ లో 10లక్షలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
- September 19, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతీ రోజు 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 93,337 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 53,08,015కు చేరాయి. అయితే, ఇందులో 42,08,432 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా, 10,13,964 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో నమోదవుతున్న కరోనా మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల్లో కరోనా కాటుకి బలై 1247 మంది మరణించారు. ఒక్కరోజులో ఈ స్థాయిలో నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 85,619కు పెరిగింది.
తాజా వార్తలు
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…
- సౌదీ అరేబియా: ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది మృతి..







