IPL సందడి మొదలయింది.. కరోనా కట్టడికి అబుధాబి కసరత్తు

- September 20, 2020 , by Maagulf
IPL సందడి మొదలయింది.. కరోనా కట్టడికి అబుధాబి కసరత్తు

అబుధాబి: యూఏఈ లో పెరుగుతున్న కరోనా కేసులు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. యూఏఈ రాజధాని అయిన అబుధాబి లో మరింతగా కేసులు నమోదవుతుండటంతో అధికారులు తాజా మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతిష్టాత్త్మకంగా చేపట్టిన IPL అబుధాబి, దుబాయ్ మరియు షార్జాలో జరగనుండగా మరింత కఠినంగా ఈ మార్గదర్శకాలు అమలు చేసుందుకు నడుం బిగించింది అబుధాబి ప్రభుత్వం.

అబుదాబిలో వివాహాలు మరియు అంత్యక్రియలకు ఆరోగ్య అధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు. వీటికి గరిష్టంగా 10 మందికి మించి హాజరవ్వకూడదని మరియు ప్రతిఒక్కరు ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అనేది ప్రధాన నియమం. కార్యక్రమాలకు ఫస్ట్-డిగ్రీ బంధువులకు (వ్యక్తి యొక్క తల్లిదండ్రులు, తోబుట్టువులు, బిడ్డలు) మాత్రమే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. సమావేశానికి 24 గంటల ముందు కోవిడ్ -19 పరీక్ష చేయించుకోవాలి అని సిఫార్సు చేశారు అధికారులు.

సంతాప సమావేశాలను నిషేధిస్తూ టెలిఫోన్ లేదా ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా సంతాపాన్ని అందించాలని ప్రజలకు అధికారులు సూచించారు. వివాహ/అంత్యక్రియల కార్యక్రమాలలో సింగిల్-యూజ్ (డిస్పోసబుల్) పాత్రలను అధికారులు సిఫార్సు చేస్తున్నారు.

క్లుప్తంగా..

- అధికారిక వివాహ వేడుకలు మాత్రమే అనుమతింపబడతాయి. వీటికి గరిష్టంగా 10 అతిథులు మాత్రమే హాజరవ్వాలి.

- అన్ని సమయాల్లో ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి.

- అంత్యక్రియలకు గరిష్టంగా 10 మంది మాత్రమే హాజరవ్వాలి.

- సంతాప సమావేశాలు అనుమతించబడవు. బదులుగా టెలిఫోన్ లేదా ఇతర కమ్యూనికేషన్ పద్ధతుల ద్వారా సంతాపం తెలుపమని అధికారుల సిఫార్సు.

- సింగిల్ యూజ్ పాత్రలను వాడండి (అవసరమైతే).

- ఏదైనా సమావేశానికి లేదా కార్యక్రమానికి హాజరు కావడానికి 24 గంటల ముందు కోవిడ్ -19 పరీక్ష చేయించుకోవాలి.

- ఏదేని కార్యక్రమంలో 2 మీటర్ల కంటే తక్కువ కాకుండా భౌతిక దూరాన్ని పాటించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com