హోటల్ బిజినెస్‌లో అడుగు పెట్టిన షైన్ స్క్రీన్స్ అధినేతలు..
- September 21, 2020హైదరాబాద్:హోటల్ బిజినెస్‌లో అడుగు పెట్టిన షైన్ స్క్రీన్స్ అధినేతలు.. దర్శకులు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ చేతుల మీదుగా గ్రాండ్‌గా ప్రారంభమైన "1980స్ మిలటరీ హోటల్" (1980's Military Hotel)
నాగచైతన్య, సమంత జంటగా 'మజిలీ' వంటి బ్లాక్‌బస్టర్ మూవీని నిర్మించి, ప్రస్తుతం నాని హీరోగా 'టక్ జగదీష్' చిత్రాన్ని నిర్మిస్తోన్న షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. పాపులర్ డైరెక్టర్ సుధీర్ వర్మ సోదరుడు ఫణి వర్మతో కలిసి హైదరాబాద్‌లో "1980స్ మిలటరీ హోటల్" (1980's Military Hotel)ను స్టార్ట్ చేశారు.
ఖాజగూడ-నానక్‌రామ్ గూడ రోడ్డులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఏర్పాటుచేసిన ఈ హోటల్‌ను సోమవారం ఉదయం టాలెంటెడ్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ చేతుల మీదుగా ప్రారంభించారు. హోటల్ పేరు వింటేనే నోరు ఊరుతోందని, తప్పకుండా ఈ హోటల్‌కు మంచి పేరు వస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.
సంప్రదాయబద్ధమైన, నోరూరించే తెలుగింటి రుచులతో, అత్యంత పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తమ హోటల్లో అందిస్తామని "1980స్ మిలటరీ హోటల్" యజమానులు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక