గ్రేడ్‌ 1 నుంచి ఇంగ్లీషు భాషని ప్రవేశపెట్టనున్న సౌదీ

గ్రేడ్‌ 1 నుంచి ఇంగ్లీషు భాషని ప్రవేశపెట్టనున్న సౌదీ

రియాద్:సౌదీ అరేబియా, ఇంగ్లీషు లాంగ్వేజ్‌ని గ్రేడ్‌ వన్‌ నుంచే ప్రిలిమినరీ స్కూల్స్‌లో ప్రవేశపెట్టనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఎడ్యుకేషన్‌ మినిస్టర్‌ వెల్లడించారు. పబ్లిక్‌ స్కూల్స్‌లో ప్రస్తుతం గ్రేడ్‌ 6 నుంచి మాత్రమే ఇంగ్లీషు లాంగ్వేజ్‌ క్లాసులు వుంటున్నాయి. విద్యార్థుల ఫ్యూచర్‌ కెరీర్‌ని దృష్టిలో పెట్టుకుని, అంతర్జాతీయ జాబ్‌ మార్కెట్‌కి అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఎడ్యుకేషన్‌ మినిస్టర్‌ పేర్కొన్నారు. ఐదు కొత్త సైన్స్‌ మరియు మేథమెటిక్స్‌ కోర్సుల్ని కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు మినిస్టర్‌ వివరించారు.

Back to Top