మూడు ప్రతిష్టాత్మక అవార్డులు

మూడు ప్రతిష్టాత్మక అవార్డులు

మనామా:ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మరియు ఇ-క్రియేటివిటీ డైరెక్టరేట్‌, సరికొత్త మైలు రాయిని అందుకోవడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో మూడు ప్రతిష్టాత్మక పురస్కారాల్ని అందుకుంది ఈ విభాగం. టెక్నలాజికల్‌ ఇన్నోవేషన్‌ విభాగంలో మిడిల్‌ ఈస్ట్‌ నుంచి మూడు ఇంటర్నేషనల్‌ స్టీవీ అవార్డుల్ని గెల్చుకోవడం జరిగింది. మొత్తం 17 దేశాల నుంచి 500 మంది పార్టిసిపెంట్స్‌ ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. జడ్జిల కమిటీలో 70 మంది నిపుణులు వున్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇ-క్రియేటివిటీ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇబ్రహీం అల్‌ సాదా సందర్భంగా మాట్లాడుతూ, 2004-2022 డెవలప్‌మెంట్‌ స్ట్రాటజీలో భాగంగా ఈ అవార్డుల్ని గెల్చుకున్నట్లు చెప్పారు.

 

Back to Top