కొత్త మేయర్ గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవంగాఎన్నిక..

- February 11, 2016 , by Maagulf
కొత్త మేయర్ గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవంగాఎన్నిక..

 గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్ గా రామ్మోహన్ ను, డిప్యూటీ మేయర్ గా బాబా ఫసియుద్దీన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన టీఆర్ ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండింటినీ కైవసం చేసుకుంది. జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్‌ఎస్ 99 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.ఈ రోజు ఉదయం జీహెచ్ఎంసీ సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.కార్పొరేటర్లు నాలుగు భాషల్లో ప్రమాణం చేశారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. మేయర్ గా చర్లపల్లి కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ పేరును వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నె కవిత ప్రతిపాదించగా, మీర్ పేట్ కార్పొరేటర్ అంజయ్య బలపరిచారు. మేయర్ పదవికి ఇతరులెవరూ పోటీపడకపోవడంతో రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక డిప్యూటీ మేయర్ గా బోరబొండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పేరును అమీర్ పేట్ కార్పొరేటర్ శేషుకుమారి ప్రతిపాదించగా, రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి బలపరిచారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com