వలసదారుల సంఖ్య తగ్గించేందుకు కొత్త ప్లాన్
- September 22, 2020
కువైట్ సిటీ:నేషనల్ అసెంబ్లీ ప్యానెల్, దేశంలో వలసదారుల సంఖ్య తగ్గించేందుకోసం డ్రాఫ్ట్ చట్టాన్ని పాస్ చేసింది. రానున్న ఐదేళ్ళలో వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే ఈ బిల్లు ఉద్దేశ్యం.అయితే, డొమెస్టిక్ వర్కర్స్ అలాగే మెగా ప్రాజెక్టులకు ఈ బిల్లులో మినహాయింపు ప్రకటించారు.హ్యామన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కమిటీ ఎంపీ ఖలీల్ అల్ సలెహ్ మాట్లాడుతూ, ప్యానెల్ ఈ బిల్లుని తయారు చేయడం జరిగిందనీ, ఎనిమిది ప్రపోజల్స్‌ని పరిశీలించి, దీన్ని రూపొందించారని చెప్పారు. అసెంబ్లీలో చర్చ కోసం ఈ చట్టాన్ని పంపినట్లు తెలిపారు. ఆరు నెలల్లో గవర్నమెంట్, దేశానికి కావాల్సిన వలసదారుల సంఖ్యను నిర్దేశించనుంది. గల్ఫ్ సిటిజన్స్, డొమెస్టిక్ హెల్పర్స్, జడ్జిలు, డిప్లమాటిక్ కార్ప్స్, ఏవియేషన్ ఆపరేటర్స్, మెగా ప్రాజెక్టుల ద్వారా నియమితులైన వలస కార్మికులు, కువైటీల స్పౌజెస్ వారి పిల్లలు, మెడికల్ మిరయు ఎడ్యుకేషనల్ స్టాఫ్ వంటివాటికి మినహాయింపులు ఇస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







