దుబాయ్ ట్రాఫిక్ జరీమానా డిస్కౌంట్ స్కీమ్ రద్దు
- September 22, 2020
దుబాయ్:మోటరిస్టులు తమ ట్రాఫిక్ చలానాలకు సంబంధించి 100 శాతం డిస్కౌంట్ పొందే అవకాశాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెకెండ్ ఎడిషన్ ప్రారంభమయ్యింది. తొలి ఎడిషన్ పూర్తయిన వెంటనే రెండో ఎడిషన్ అవకాశాన్ని ప్రారంభించారు. కాగా, ఇకపై ఎలాంటి డిస్కౌంట్లూ వర్తించబోవని దుబాయ్ పోలీస్ - ట్రాఫిక్ డిపార్మ్ఎంట్ డైరెక్టర్ జనరల్ కల్నల్ జుమా సలీం బిన్ సువైదాన్ చెప్పారు. ఇప్పటికే ఆయా డిస్కౌంట్ల కోసం నమోదు చేసుకోబడినవారికి డిస్కౌంట్స్ వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. మూడు నెలలపాటు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడనివారికి 25 శాతం డిస్కౌంట్, ఆరు నెలలపాటు ఉల్లంఘనల్లేకపోతే 50 శాతం డిస్కౌంట్, 9 నెలలకు 75 శాతం డిస్కౌంట్, ఏడాది పాటు సేఫ్గా డ్రైవ్ చేస్తే 100 శాతం అంతకు ముందు జరీమానాలపై డిస్కౌంట్ విధిస్తారు. తొలి ఏడాదిలో 557,430 మంది మోటరిస్టులు ఈ విధానం ద్వారా లాభపడ్డారు. సుమారు 546,970,930 దిర్హామ్ ల మొత్తం వాహనదారులు లాభం పొందినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు