ఇల్లీగల్ ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్
- September 22, 2020
మనామా:ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఐఎస్‌బి), విద్యార్థులకు సాయం చేస్తున్నామని చెబుతూ స్కూల్ తరఫున కొందరు అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారనీ, ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా వుండాలని ఐఎస్‌బి ఛైర్మన్ ప్రిన్స్ నటరాజన్ విజ్ఞప్తి చేశారు. స్కూల్ పేరు చెప్పి ఎలాంటి రశీదులూ లేకుండా కొందరు వ్యక్తులు వసూళ్ళకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు చేసే అక్రమ కార్యకలాపాలకు తమ సంస్థ బాధ్యత వహించబోదని అన్నారు. ఛారిటబుల్ ఇనీషియేటివ్స్‌లో భాగంగా ఐఎస్‌బికి ఎవరైనా నిధులు ఇవ్వాలనుకుంటే, ప్రిన్సిపల్ లేదా అకడమిక్ బృందాన్ని సంప్రదించాలని కోరారు. తమ స్కూల్ ద్వారా చాలామంది పిల్లలకు సేవలందిస్తున్నామని, 1000 మందికి పైగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యార్థులకు సాయమందిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







