శిరిష్, సాయిల కాంబినేషన్ ...
- February 11, 2016
టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అది కూడా ఒకే కుంటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే డబుల్ ధమాకాగా ఫీల్ అవుతారు అభిమానులు. అలాంటి డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెండో సారి రెడీ అవుతోంది మెగా ఫ్యామిలీ. ఇప్పటికే ఎవడు సినిమాలో బన్నీ, చెర్రీలు కలిసి నటించారు. ఆ సినిమాలో బన్నీ చేసింది చిన్న పాత్రే అయినా సినిమా సక్సెస్ కు వీరి కాంబినేషన్ చాలా ఉపయోగపడింది.అదే బాటలో మరో ఇద్దరు మెగా హీరోలు కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సుప్రీమ్.పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ అతిథి పాత్ర కోసం అల్లు శిరీష్ ను సంప్రదించారట. చిన్న పాత్రే అయినా.., కథకు కీలకం కావటంతో శిరీష్ కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాడు. త్వరలోనే శిరిష్, సాయిల కాంబినేషన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







