కువైట్ ప్రధానిపై 10 ఎంపీల నాన్ కోఆపరేషన్ తీర్మానం..సెప్టెంబర్ 30 ఓటింగ్
- September 23, 2020
కువైట్ సిటీ:కువైట్ ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్‌పై పది మంది ఎంపీలు సహాయ నిరాకరణ తీర్మానం దాఖలు చేశారు. తీర్మానానికి సంబంధించి ప్రక్రియ పూర్తయినట్లు..తీర్మానంలో సంతకాలు చేసిన ఎంపీల సంఖ్య పది మందికి చేరుకున్నట్లు పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్ ఈ నెల 30న ఓటింగ్ ను ఎదుర్కొవాల్సి ఉంటుంది. మంత్రివర్గంలోని ఉన్న వారు మినహా ఎన్నిక కాబడిన ఎంపీలు ఈ ఓటింగ్ లో పాల్గొంటారు. సాధారణ మెజారిటీ వస్తే తీర్మానం ఆమోదం పొందినట్లు అవుతుంది. ప్రధానిపై సహాయ నిరాకరణ తీర్మానం ఇచ్చిన ఎంపీలలో మహ్మద్ హయీఫ్, థమెర్ అల్-స్వేయిత్, మహ్మద్ అల్ ముతైర్, అబ్దుల్ కరీం అల్ కందారి, అబ్దుల్లా ఫహద్ అల్ అంజీ, హమ్దాన్ అల్ అజ్మీ, నయెఫ్ అల్ మిర్దాస్, అల్ హమీది అల్ సుబాయి, రియాద్ అల్ అదసాని, బాదర్ అల్ ముల్లా ఉన్నట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన