రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి మృతి పట్ల ఎపి గవర్నర్ సంతాపం
- September 23, 2020
విజయవాడ, సెప్టెంబర్ 23: కరోనాకు చికిత్స పొందుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి బుధవారం ఆకస్మికంగా మృతి చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషన్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ 2004 నుండి పార్లమెంటు సభ్యునిగా, 2019 నుండి రైల్వే శాఖ సహాయ మంత్రి గా పనిచేసిన సురేష్ అంగడి సేవలను కర్ణాటక ప్రజలు, దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచు కుంటారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. గవర్నర్ హరిచందన్ దివంగత సురేష్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్







