సీసీటీవీ ప్రాజెక్టు హైదరాబాద్‌ పోలీసు నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు

- February 11, 2016 , by Maagulf
సీసీటీవీ ప్రాజెక్టు హైదరాబాద్‌ పోలీసు నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు

భాగ్యనగరాన్ని విశ్వనగరంగా చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో నగరమంతా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు హైదరాబాద్‌ పోలీసు నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో సీసీటీవీ ప్రాజెక్టును ఈరోజు ఆయన ప్రారంభించారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టైటాన్‌ ఐ షోరూం నుంచి చింతల్‌ బస్తీ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర రూ.22 లక్షలతో 36 సీసీ కెమెరాలు అమర్చారు. ఈ నగదును 43 మంది దాతలు విరాళంగా అందించినట్లు సీపీ చెప్పారు.ప్రజల భాగస్వామ్యంలో ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. నేరస్థులను పట్టుకోవడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. నగరంలో ఇప్పటికే 15వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని... వచ్చే ఏడాది నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సీపీ తెలిపారు. నగరంలో ట్రాఫిక్‌ పోలీసు రహిత సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలోనే ప్రవేశ పెడుతున్నట్లు మహేందర్‌రెడ్డి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com