తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి తాత్కాలిక ఉత్తర్వులు జారీ
- February 11, 2016
తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత నిర్ణయించినట్లుగా 20 ఎకరాల్లో కాకుండా 45.129 ఎకరాల్లో సచివాలయం నిర్మించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఆర్డీఏ వేదిక ఆధారంగా 45 ఎకరాల్లో సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటిలో 27.08 ఎకరాల్లో సమీకృత ప్రభుత్వ భవన సముదాయం, 18.47 ఎకరాల్లో ప్రజా సదుపాయాల భవనాలను నిర్మించనున్నారు. మరోవైపు తాత్కాలిక సచివాలయం భవన నిర్మాణంపై టెండర్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని మున్సిపల్ శాఖ అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







