తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి తాత్కాలిక ఉత్తర్వులు జారీ

- February 11, 2016 , by Maagulf
తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి తాత్కాలిక ఉత్తర్వులు జారీ

తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈరోజు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత నిర్ణయించినట్లుగా 20 ఎకరాల్లో కాకుండా 45.129 ఎకరాల్లో సచివాలయం నిర్మించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఆర్‌డీఏ వేదిక ఆధారంగా 45 ఎకరాల్లో సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటిలో 27.08 ఎకరాల్లో సమీకృత ప్రభుత్వ భవన సముదాయం, 18.47 ఎకరాల్లో ప్రజా సదుపాయాల భవనాలను నిర్మించనున్నారు. మరోవైపు తాత్కాలిక సచివాలయం భవన నిర్మాణంపై టెండర్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని మున్సిపల్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com