రేపు ఉదయం బాలు అంత్యక్రియలు...
- September 25, 2020
చెన్నై:శనివారం ఉదయం పదిన్నరకు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు జరగనున్నాయి.. తిరువళ్లూరు జిల్లా రెడ్ హిల్స్ సమీపంలోని తమరైపాక్కంలో ఎస్పీ బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. అంతకు ముందు ఎంజీఎం ఆస్పత్రి నుంచి బాలు పార్థివదేహాన్ని చెన్నై కోడంబాక్కంలోని ఎస్పీ చరణ్ నివాసానికి తరలించారు.. అభిమానుల సందర్శనార్థం కొద్ది సమయం అక్కడే ఉంచారు.. సినీ, రాజకీయ ప్రముఖులంతా తరలివచ్చి బాలసుబ్రమణ్యం పార్థివ దేహానికి నివాళులర్పించారు.. కరోనా నిబంధనల నేపథ్యంలో శనివారం కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు అతికొద్ది మంది సమక్షంలో అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఆగస్టు 5న కరోనా సోకడంతో ఎస్పీ బాలు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఇదే ఆసుపత్రిలో గత కొంతకాలంగా చికిత్స తీసుకున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ప్రతిరోజూ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వచ్చారు.. తండ్రి ఆరోగ్య పరిస్థితిని కుమారుడు ఎస్పీ చరణ్ సైతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వివరించారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో అప్పట్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో అప్పటి నుంచి ఆయన ఎక్మో సపోర్టుతో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కొలుకున్నాక.. మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో తుదిశ్వాస విడిచారు. అందరిని ఇన్నేళ్లుగా తన పాటలతో అలరించిన బాలు... తిరిగి క్షేమంగా వస్తారనుంటున్న సమయంలో... ఆయన తుదిశ్వాస విడవటం అభిమానులకు కన్నీటి వ్యధను మిగిల్చింది.
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్







