'దిశ ఎన్కౌంటర్' ట్రైలర్ విడుదల...
- September 26, 2020
హైదరాబాద్:గతేడాది హైదరాబాద్ శివార్లలో సంచలన సృష్టించిన దిశ ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "దిశ ఎన్కౌంటర్". ఈ చిత్రం ట్రైలర్ ఈరోజు దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విటర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. సుమారు 02:44 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్... నవంబర్ 26 ఉదయం 6:10 గంటలకు ప్రారంభం అవుతుంది. రోడ్డు పక్కన స్కూటీని పార్క్ చేసి... వెహికిల్ కోసం ఎదురు చూస్తున్న వెటర్నరీ డాక్టర్ దిశపై అక్కడే ఉన్న నలుగురు లారీ డ్రైవర్ల కన్ను పడుతుంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో స్కూటీని పంచర్ చేస్తారు. సాయం కోసం రోడ్డు మీద నిల్చున్న దిశను కిడ్నాప్ చేసి... లారీలో తీసుకెళ్తారు. ఆమెను దారుణంగా రేప్ చేసి.. అనంతరం మృతదేహాన్ని తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగలబెడతారు. ఇది జరుగుతున్న సమయంలో ఓ పోలీస్ పెట్రోలింగ్ వాహనం అక్కడి నుంచి వెళ్లడం... శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు నిందితులు పోలీస్ కాల్పులలో మరణించిన ఘటనతో ఈ సినిమా పూర్తవుతుంది. ‘దిశ ఎన్కౌంటర్’ ట్రైలర్ నాటి ఘటనను కళ్లకు కడుతుంది.
ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనురాగ్ కంచర్ల నిర్మిస్తున్నారు. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 26 తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత అనురాగ్ కంచర్ల తెలిపారు. ఈ చిత్రంతో శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా ఆకుల, ప్రవీణ్ రాజ్, నవీన్ బోనం, కళ్యాణ్ వీరమల్ల, ముని మాయదారి తదితరులు నటిస్తున్నారు. ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ కళ్యాణ్ సమీ, ఆర్ట్ డైరెక్టర్ జి.సందీప్ కుమార్, సంగీతం డి. ఎస్. ఆర్., సౌండ్ ఎఫెక్ట్ శేషు కుమార్, పి.ఆర్.ఓ. మధు వి.ఆర్.

తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్







