మరోసారి లాక్ డౌన్ అంటూ ప్రచారం..కొట్టిపారేసిన యూఏఈ మంత్రిత్వ శాఖ
- September 27, 2020
యూఏఈ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధిస్తోదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. అధికారిక ట్విట్టర్లో ఈ విషయాన్ని షేర్ చేస్తూ...సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ట్వీట్లను స్క్రీన్ షాట్ తీసి ఫేక్ న్యూస్ అంటూ ట్వీట్ చేసింది. కింగ్డమ్ లో రోజు రోజుకీ వైరస్ తీవ్రత పెరిగిపోతుండటంతో ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధిస్తోందని, ఆదివారం నుంచి లాక్ డౌన్ అమలులోకి వస్తుందని, ప్రజలు అందరూ బయటికి రాకుండా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే..ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ప్రభుత్వం లాక్ డౌన్ విధించలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పౌరులు, ప్రవాసీయులు అధికారిక వర్గాల నుంచి వెలువడే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం