గోవాలో పున:ప్రారంభమైన దిలీప్ రాజా ‘యూత్’ చిత్ర షూటింగ్
- September 27, 2020
గోవా:బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ సమర్పణలో.. పెదరావురు ఫిల్మ్ సిటీ బ్యానర్‌పై.. అలీతో ‘పండుగాడి ఫొటో స్టూడియో’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు దిలీప్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యూత్’. ‘కుర్రాళ్ళ గుండె చప్పుడు’ అనేది ట్యాగ్‌లైన్. లాక్డౌన్ కారణంగా మార్చిలో ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి గోవాలో ప్రారంభించినట్లుగా దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘గోవాలో ‘యూత్’ చిత్ర షూటింగ్‌ను పున: ప్రారంభించాము. ఈ షెడ్యూల్ తొమ్మిది రోజులు గోవాలోనే జరుగతుంది. రెండవ షెడ్యూల్ నవంబర్ 9 నుంచి రాజస్థాన్ ఎడారిలో చిత్రీకరిస్తాము. జనవరిలో చివరి షెడ్యూల్, క్లైమాక్స్ సన్నివేశాలను ఏపీలోని 13 జిల్లాలలో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నాము. 2021 ఏప్రిల్‌కు సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఆ సమయానికి కరోనాకు వ్యాక్సిన్ వస్తుందని, తిరిగి థియేటర్లకు ప్రేక్షకులు ఎలాంటి భయం లేకుండా వస్తారని ఆశిస్తున్నాము. ఈ గోవా షెడ్యూల్లో బీచ్ దగ్గర కొన్ని ఛేజింగ్ సన్నివేశాలు, అలాగే చిత్రంలోని కీలక సంఘటనలను చిత్రీకరించనున్నాము. ఈ సినిమా కథను, అలాగే ఇందులో నటించే నటీనటుల వివరాలను ప్రస్తుతానికి కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతున్నాము. నవంబర్‌లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి.. ఈ వివరాలను ప్రకటిస్తాము. యూత్ చిత్రమే కాకుండా ‘తను నేనూ ఒక్కటే’ అనే టైటిల్‌తో కూడా ఓ చిత్రం రూపొందించనున్నాము. ఈ టైటిల్‌కు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అనుమతి వచ్చింది. 2021లో ఈ చిత్రం మొదలవుతుంది..’’ అని తెలిపారు.
‘యూత్’ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దిలీప్ రాజా.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..