అబుధాబి:అనుమతి లేని టాక్సీలపై Dh3000 జరిమానా; వాహనదారులకు పోలీసుల వార్నింగ్

- September 28, 2020 , by Maagulf
అబుధాబి:అనుమతి లేని టాక్సీలపై Dh3000 జరిమానా; వాహనదారులకు పోలీసుల వార్నింగ్

అబుధాబి:సరైన అనుమతులు లేకుండా అక్రమంగా టాక్సీలు నడిపే డ్రైవర్లు, వాహనదారులపై మరింత కఠినంగా ఉంటామని అబుధాబి పోలీసులు హెచ్చరించారు. టాక్సీ లైసెన్స్ లేకుండా ప్రయాణికులను తరలించి పట్టుబడితే Dh3000 జరిమానాతో పాటు 24 ట్రాఫిక్ పాయింట్ల విధిస్తామని, అలాగే వాహనాన్ని 30 రోజులు జప్తు చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రవాణా భద్రత విభాగం అధికారులు అబుధాబి పోలీసులు..ఇంటీగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ సెంటర్ తో సమన్వయం చేసుకుంటూ అబుధాబిలోని ఇల్లీగల్ టాక్సీలను కట్టడి చేస్తున్నట్లు వివరించారు. అబుధాబిలో తిరిగే ప్రతి టాక్సీ సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకొని ఉండాలని టాక్సీ లైసెన్స్ లేకుండా ప్రయాణికులను తరించటం చట్టవిరుద్ధమే కాకుండా...ప్రయాణికుల భద్రతను రిస్క్ లో పెట్టడమేనని పోలీసులు అభిప్రాయపడ్డారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా టాక్సీలను నిర్వహిస్తుంటే..ఇంకొందరు వాహనదారులు లైసెన్స్ డ్రైవర్లతో టాక్సీలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారిని గుర్తించి..అక్రమ టాక్సీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నామని అన్నారు. అక్రమ టాక్సీల తమ దృష్టిలో పడకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉండటంతో అండర్ కవర్ ఆపరేషన్లు ముమ్మరంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు పట్టుకున్న అక్రమ టాక్సీలలో ఎక్కువగా మఫ్టీలో ఉన్న అధికారులే గుర్తించారని వివరించారు. గతేడాదిలో సరైన అనుమతి లేకుండా టాక్సీలను నడుపుతున్న 3,376 ప్రైవేట్ కార్లను సీజ్ చేసినట్లు అబుధాబి పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com