వర్చువల్‌ జి20 నాయకుల సమావేశం

- September 28, 2020 , by Maagulf
వర్చువల్‌ జి20 నాయకుల సమావేశం

రియాద్:2020 జి20 నాయకుల సదస్సు వర్చువల్‌ పద్ధతిలో నవంబర్‌ 21-22 తేదీల్లో జరుగుతుందని సౌదీ అరేబియా కింగ్‌ సల్మాన్‌ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో జి20 అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిందని ఈ సందర్భంగా ఓ ప్రకటన కింగ్‌ సల్మాన్‌ తరఫున వెలువడింది. గ్లోబల్‌ ఎకానమీని కాపాడేందుకు 11 ట్రిలియన్‌ డాలర్లను ఇంజెక్ట్‌ చేసినట్లు ఆ ప్రకటనలో ప్రస్తావించారు. జి20, 21 బిలియన్‌ డాలర్లను కరోనా నేపథ్యంలో వివిధ అవసరాల నిమిత్తం సమకూర్చినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న జి20 నాయకుల సదస్సులో అభివృద్ధి సహా అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com