ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- September 28, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజగా ఏపీ ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 5,487 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,81,161కి చేరింది.ఇందులో 63116 కేసులు యాక్టివ్ గా ఉంటె, 612300 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5745కి చేరింది. ఇక ఇదిలా ఉంటె, జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 310, చిత్తూరులో 329, తూర్పు గోదావరి జిల్లాలో 1010, గుంటూరులో 538, కడపలో 271, కర్నూలులో 113, కృష్ణా జిల్లాలో 97, నెల్లూరులో 489, ప్రకాశంలో 634, శ్రీకాకుళంలో 286, విశాఖపట్నంలో 145, విజయనగరంలో 362, పశ్చిమ గోదావరిలో 903 కేసులు నమోదయ్యాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!