'మోసగాళ్లు' టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌తో అందరి ప్రశంసలు అందుకుంటున్న శ్యామ్ సిఎస్
- September 28, 2020_1601301501.jpg)
హైదరాబాద్:విష్ణు హీరోగా నటిస్తోన్న 'మోసగాళ్లు' టైటిల్ కీ థీమ్ మ్యూజిక్ ఇటీవల 'ద రైజ్ ఆఫ్ మోసగాళ్లు' పేరిట విడుదలైంది. ఆసక్తికరంగా ఉన్న ఆ థీమ్ మ్యూజిక్ బాగా పాపులర్ అయ్యింది. కుర్చీలలో మునివేళ్లపై కూర్చోపెట్టి చూసే థ్రిల్లర్‌గా 'మోసగాళ్లు' చిత్రం ఉంటుందనే అభిప్రాయాన్ని అది కలిగించింది.
దక్షిణ భారత సినీ రంగంలోని ప్రముఖ సంగీత దర్శకుల్లో ఒకరిగా పేరుపొందిన శ్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. థీమ్ మ్యూజిక్‌తో అందరి మనసుల్నీ గెలుచుకున్న ఆయన, ఆ ఎక్సపెక్టేషన్స్‌కు మ్యాచ్ అయ్యేలా ఈ సినిమాకు సంబంధించిన తదుపరి ప్రమోషనల్ కంటెంట్‌కు వర్క్ చేస్తున్నారు. అలాగే సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి కృషి చేస్తున్నారు.
హీరోగా నటిస్తూ విష్ణు మంచు నిర్మిస్తోన్న 'మోసగాళ్లు' సినిమాకు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు సోదరిగా ఆయన పాత్రతో సమాన ప్రాధాన్యం ఉన్న పాత్రను కాజల్ అగర్వాల్ చేస్తున్నారు.
భారత్‌లో మొదలై, అమెరికాను వణికించిన చరిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా 'మోసగాళ్లు' చిత్రం రూపొందుతోంది.
బాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం