మస్కట్:నవంబర్ 15న మసీదులు, ప్రార్ధనామందిరాల పున:ప్రారంభంపై నిర్ణయం

- September 29, 2020 , by Maagulf
మస్కట్:నవంబర్ 15న మసీదులు, ప్రార్ధనామందిరాల పున:ప్రారంభంపై నిర్ణయం

మస్కట్:అన్ లాక్ ప్రక్రియలో భాగంగా కొన్ని సెక్టార్లలో కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్న ఒమన్ ప్రభుత్వం..ప్రార్ధనామందిరాల విషయంలో వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది. ప్రజల ఆరోగ్య సంరక్షణకే తమ ప్రధాన్యమని చెబుతున్న ప్రభుత్వం..ఒమన్ లోని మసీదులు, ఇతర ప్రార్ధనా మందిరాల పున:ప్రారంభంపై నవంబర్ 15న తగిన నిర్ణయం తీసుకంటామని స్పష్టత ఇచ్చింది. అయితే..కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ..సెప్టెంబర్ 22న జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణమైన పరిస్థితులు ఉంటేనే మసీదులు, ప్రార్ధనా మందిరాలకు అనుమతి ఇస్తామని కూడా వెల్లడించింది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రార్ధనామందిరాలకు అనుమతి ఇవ్వటం వల్లే కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తాము నమ్ముతున్నామని ప్రభుత్వం వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com