కువైట్:విదేశీ విద్యార్ధులు, నర్సులకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ రద్దు

- September 29, 2020 , by Maagulf
కువైట్:విదేశీ విద్యార్ధులు, నర్సులకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ రద్దు

కువైట్ సిటీ:విదేశీ విద్యార్ధులు, నర్సులకు కువైట్ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ ల జారీని రద్దు చేసింది. మంత్రివర్గ తీర్మానం 270(2020) మేరకు ఇక నుంచి పలు యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్ధులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో విధులు నిర్వహిస్తున్న నర్సులకు డ్రైవింగ్ లైసెన్స్ లను ఇవ్వరు. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖలోని ట్రాఫిక్ వ్యవహారాల సహాయ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. నిజానికి గత మార్చి 18నే ఈ నిర్ణయం తీసుకున్నారు.  1976 నాటి మంత్రివర్గ తీర్మానం 81ని సవరిస్తూ 270(2020) తీర్మానానికి ప్రస్తుత మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే..కరోనా ప్రభావంతో తీర్మానం అమలు వాయిదా పడింది. ఎట్టకేలకు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో తక్షణమే తీర్మానం అమలులోకి తీసుకొచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com