హోం క్వారంటైన్ ఉల్లంఘన: ఆరుగురి అరెస్ట్
- September 29, 2020
దోహా:హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉ్లలంఘించిన ఆరుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ నేపథ్యంలో పటిష్టమైన రీతిలో నిబంధనల్ని తీసుకొచ్చింది హెల్త్ అథారిటీ. వీటిల్లో హోం క్వారంటైన్ కూడా ఒకటి. కాగా, హోం క్వారంటైన్ ఉల్లంఘనకు సంబంధించి అరెస్ట్ అయిన వారి వివరాలు ఇలా వున్నాయి. ముబారక్ సలెహ్ మొహమ్మద్ సలెహ్ అల్ కమ్రా, అబ్దుల్లాహ్ అబ్లున రజాక్ నుమాన్ అలి అల్ జాబారి, అబ్దుల్లా మొహమ్మద్ అబ్దుల్‌హమీద్ జుసెఫ్, మొహమ్మద్ హారిస్ మర్తాహా, సైఫ్ బఖ్రిత్ సైఫ్ అల్ అత్బా అల్ మర్రి మరియు ఖలీల్ ఇబైద్ అల్ ఒమర్‌లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. హెల్త్ అథారిటీ సూచించిన నిబంధనలు పాటించాలి.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!