సౌదీ సెక్యూరిటీ అథారిటీస్‌ సామర్థ్యాన్ని అభినందించిన బహ్రెయిన్‌

- September 29, 2020 , by Maagulf
సౌదీ సెక్యూరిటీ అథారిటీస్‌ సామర్థ్యాన్ని అభినందించిన బహ్రెయిన్‌

మనామా: ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ నుంచి తీవ్రవాదంపై శిక్షణ పొందుతోన్న టెర్రరిస్ట్‌ సెల్‌ని భగ్నం చేయడంలో సౌదీ సెక్యూరిటీ అథారిటీస్‌ చాకచక్యాన్ని బహ్రెయిన్‌ అభినందించింది. తీవ్రవాదాన్ని అణచివేసే క్రమంలో సౌదీ అరేబియాకి అండగా వుంటామని బహ్రెయిన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ మేరకు బహ్రెయిన్‌ ఫారిన్‌ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. టెర్రరరిస్టుల్ని తయారు చేయడం ద్వారా అశాంతిని రగల్చాలన్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు బహ్రెయిన్‌ పిలుపునిచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com