శబరిమల: మండల యాత్రకు అనుమతి ఇచ్చిన కేరళ ప్రభుత్వం

- September 29, 2020 , by Maagulf
శబరిమల: మండల యాత్రకు అనుమతి ఇచ్చిన కేరళ ప్రభుత్వం

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది కేరళ ప్రభుత్వం. అయ్యప్ప స్వాముల మండల యాత్రలో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి అనుమతి ఇచ్చింది. నవంబర్‌ 16 నుంచి ప్రారంభించనున్న మండల యాత్ర ఓకే చేసింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికారులకు, ట్రావెన్‌ కోర్‌ ట్రస్ట్‌ బోర్డుకు ఆదేశాలిచ్చారు.

మండలయాత్రపై సోమవారం సమావేశమై చర్చించిన ముఖ్యమంత్రి  ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో రెండు నెలల పాటు శబరి గిరులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగనున్నాయి. కాగా, కోవిడ్  నేపథ్యంలో ప్రభుత్వం మార్గదర్శకాలను తప్పని సరిగా పాటించాల్సి ఉంటుందని తెలిపింది.  నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  డిజిటల్ విధానం ద్వారా పేర్లు రిజిస్టర్‌ చేసుకున్న వారికే ఆలయంలోకి భక్తులకు అనుమతి ఉంటుందని పేర్కొంది.  పంబానదిలో స్నానాలు చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదని వెల్లడించింది కేరళ ప్రభుత్వం.
సన్నిధానంలోని అతిథిగృహాలు, ఇతర నివాస సముదాయాల్లో బస చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదని, స్వామి వారిదర్శనం అనంతరం తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుందని పేర్కొంది. విధిగా మాస్క్‌ ధరించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులపై ఎలాంటి నిషేధం విధించడం లేదని, కేవలం కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్న వారిని అనుతించబోమని స్పష్టం చేసింది. మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో కూడిన చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ.. పంబా, ఎరుమేలిలో స్నానఘట్టాలలో షవర్లు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే భక్తులు అభిషేకం కోసం తెచ్చే నెయ్యిని సేకరించి, తిరిగి యాత్రికులకు తిరిగి ఇచ్చే విషయమై ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డ్‌ నిర్ణయం తీసుకోలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com