కువైట్ కొత్త అమిర్ గా షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సభా

- September 30, 2020 , by Maagulf
కువైట్ కొత్త అమిర్ గా షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సభా

కువైట్ సిటీ:సార్వభౌమాధికారాన్ని చాటుకుంటూనే తన దౌత్య నైపుణ్యంతో ప్రపంచ దేశాలతో సాన్నిహిత్యం కొనసాగిస్తూ కువైట్ ను అభివృద్ధి పథంలో నడిపించిన కువైట్ ఎమిర్ షేక్ సాబా అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సాబా అస్వస్థతతో కన్నుమూశారు. 91 ఏళ్ల ఎమిర్ అస్వస్థతతో బాధపడుతూ అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆయన కన్నుమూసినట్లు మంగళవారం ఎమిర్ కార్యాలయం ప్రకటించింది. కువైట్ ఎమిర్ గా 50 ఏళ్ల పాటు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ప్రజల మన్ననలను పొందారాయన. చమురు ఉత్పత్తితో సంపన్న దేశంగా తీర్చిదిద్దారు. అలాగే విదేశీ విధానాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రపంచదేశాలతో సాన్నిహిత్యం కొనసాగిస్తూ కువైట్ కు అంతర్జాతీయంగా బలోపేతం చేశారు. 2006 నుంచి అమెరికాతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగితస్తూ ఇటు అరబ్ దేశాలతోనూ సత్సంబంధాలను సమతుల్యంగా నడిపించారు. ఇరాన్ తో బహిరంగ చర్చలు నేరవేర్పుతూనే ఇరాక్ తో సత్సంబంధాలను పునర్నిర్మించారు. సౌదీ అరేబియాతో సన్నిహిత్యంగా మసలుకున్నారు. ఇలా తన దౌత్య నైపుణ్యంతో కువైట్ కు బలమైన ఆర్ధిక వ్యవస్థకు పునాదులు వేశారు. అంతర్జాతీయ వ్యాపారం, పెట్టుబడి విధానాల్లోనూ కువైట్ ను బలమైన దేశంగా నిలబెట్టిన ఎమిర్ మృతితో కువైట్ సమాజం శోకసంద్రమైంది. అరబ్ దేశాలతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి పలు దేశాల అధినేతలు ఎమిర్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

అయితే..ఎమిర్ షేక్ సాబా స్థానంలో అతని వారసుడ్ని ఇంకా అధికారికంగా ప్రకటిచనప్పటికీ..తన సోదరుడు 3 ఏళ్ల షేక్ నవాఫ్ ను ఎమిర్ వారసుడిగా పరిపాలనా బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు ఎమిర్ మృతి, వారసత్వ ప్రక్రియపై అధికార ప్రకటన ఆలస్యం కావటం కువైట్ మార్కెట్ పై ప్రభావం చూపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ తో కువైట్ కరెన్సీ విలువ తగ్గింది. అలాగే కువైట్ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే..ఇది తాత్కాలికమేనని ఎమిర్ లేకపోయినా ఆయన రూపొందించిన ఆర్ధిక విధానం కువైట్ ను నిలదొక్కుకునేలా చేస్తుందని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. చమురు విధానాన్ని ఎమిర్ ఏర్పాటు చేసిన సుప్రీం పెట్రోలియం కౌన్సిల్ నిర్దేశిస్తుందని గుర్తు చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com