మరోసారి తెలంగాణకు ప్రధమ స్థానం...

- September 30, 2020 , by Maagulf
మరోసారి తెలంగాణకు ప్రధమ స్థానం...

హైదరాబాద్:అక్టోబర్ 2 వ తేదీ గాంధీ జయంతిని పురష్కరించుకొని స్వచ్ఛభారత్ దివస్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ప్రతి ఏడాది ఆరోజున దేశంలో స్వచ్ఛతను సాధించిన రాష్ట్రాలకు అవార్డులు ప్రకటిస్తుంది కేంద్రం.  కాగా, ఈ ఏడాది స్వచ్ఛభారత్ అవార్డులకు ఎంపికైన రాష్ట్రాలను కేంద్రం ప్రకటించింది.  ఈ ఏడాది స్వచ్ఛత సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచింది. స్వచ్ఛభారత్ లో తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానం సాధించడం ఇది మూడోసారి.  ఇక ఇదిలా ఉంటె, జిల్లాల కేటగిరిలో కరీంనగర్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది.  అవార్డులను అక్టోబర్ 2 వతేదీన స్వచ్ఛభారత్ దివస్ రోజున ప్రకటించనున్నారు.  దేశాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు 2014 అక్టోబర్ 2 వ తేదీన మోడీ సర్కార్ స్వచ్ఛభారత్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  అప్పటి నుంచి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రతి రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com