కువైట్ ఎమిర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన బహ్రెయిన్ ప్రధాని
- September 30, 2020
మనామా:కువైట్ ఎమిర్ షేక్ సాబా అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సాబా మృతి పట్ల బహ్రెయిన్ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలిఫా బిన్ సల్మాన్ అల్ ఖలిఫా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. కువైట్ ప్రజలతో అరబ్, ఇస్లామిక్ దేశాలు గొప్ప నాయకుడ్ని కొల్పోయాయని అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేమన్నారు. కువైట్ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఎమిర్..గల్ఫ్ కార్పోరేషన్ కౌన్సిల్ బలోపేతంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అలాగే అరబ్ దేశాల హక్కులు, భద్రత, స్థిరత్వం కోసం ఆయన బలంగా వాదించేవారని గుర్తు చేశారు. సమర్ధవంతమైన నాయకత్వంతో పాటు మానవతావాదిగా పేరున్న ఎమిర్ మృతి కువైట్ సోదరులను తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని...అయితే, వారు ఈ విషాదం నుంచి కోలుకొని మరింత అభివృద్ధి దిశగా పయనించాలని బహ్రెయిన్ ప్రధాని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన