మరోసారి తెలంగాణకు ప్రధమ స్థానం...
- September 30, 2020
హైదరాబాద్:అక్టోబర్ 2 వ తేదీ గాంధీ జయంతిని పురష్కరించుకొని స్వచ్ఛభారత్ దివస్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది ఆరోజున దేశంలో స్వచ్ఛతను సాధించిన రాష్ట్రాలకు అవార్డులు ప్రకటిస్తుంది కేంద్రం. కాగా, ఈ ఏడాది స్వచ్ఛభారత్ అవార్డులకు ఎంపికైన రాష్ట్రాలను కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది స్వచ్ఛత సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచింది. స్వచ్ఛభారత్ లో తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానం సాధించడం ఇది మూడోసారి. ఇక ఇదిలా ఉంటె, జిల్లాల కేటగిరిలో కరీంనగర్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. అవార్డులను అక్టోబర్ 2 వతేదీన స్వచ్ఛభారత్ దివస్ రోజున ప్రకటించనున్నారు. దేశాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు 2014 అక్టోబర్ 2 వ తేదీన మోడీ సర్కార్ స్వచ్ఛభారత్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రతి రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







