యూఏఈ: ఆరు ఉన్నత విద్యాసంస్థల లైసెన్స్ రద్దు చేసిన విద్యాశాఖ
- September 30, 2020
యూఏఈలోని ఆరు ఉన్నత విద్యా సంస్థల లైసెన్స్ లను రద్దు చేసినట్లు విద్యాశాఖ మంత్రి కార్యాలయం ప్రకటించింది. సరైన అకాడమిక్ విధానం అనుసరించకపోవటంతో పాటు పరిపాలనా వ్యవహారాల్లోనూ లోటుపాట్లు ఉండటంతో విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ ఆరు విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసినట్లు ఓ ప్రకటనలో వివరించింది. అలాగే మరో ఆరు విద్యాసంస్థలపై కూడా దృష్టి సారించామని, వాటి పని తీరును పర్యవేక్షిస్తున్నామని వెల్లడించింది. మరోవైపు యూనివర్సిటీలు, కాలేజీల ఏర్పాటుకు సంబంధించి నాలుగు సంస్థలకు లైసెన్స్ జారీ చేయగా..మరో నాలుగు దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపింది. విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు విద్యాసంస్థలు అనుసరిస్తున్న ప్రమాణాల మేరకు వాటిని అధిక, మధ్యస్థం, తక్కువ, అతి తక్కువ గ్రేడింగులు ఇస్తున్నట్లు ఉన్నత విద్య శాఖ సలహాదారు, విద్యాసంస్థల గుర్తింపు కమిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ యూసుఫ్ మొహమ్మద్ యూసుఫ్ బని యస్ చెప్పారు. అకాడమిక్ కార్యచరణ, ప్రాణాళిక అమలులో వ్యూహాత్మక ఆచరణ, విద్యార్ధుల పట్ల శ్రద్ధ, ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్ధుల విషయంలో తీసుకునే జాగ్రత్తలను అనుసరించి గ్రేడింగ్ లు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు