అసభ్యకరమైన డ్రెస్సింగ్‌ సబబు కాదు

- October 01, 2020 , by Maagulf
అసభ్యకరమైన డ్రెస్సింగ్‌ సబబు కాదు

బహ్రెయిన్: కోస్టల్‌ ఏరియాస్‌లో అసభ్యకరమైన వస్త్రధారణతో హల్‌చల్‌ చేస్తే, అలాంటివారిపై చర్యలు తప్పవని అథారిటీస్‌ హెచ్చరించాయి. కొందరు విదేశీయులు కోస్టల్‌ ఏరియాలో అసభ్యకరమైన వస్త్రధారణతో కనిపిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో అథారిటీస్‌ స్పందించడం జరిగింది. నార్తరన్‌ గవర్నరేట్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ మొహమ్మద్‌ అల్‌ దుసారి మాట్లాడుతూ, వస్త్రధారణ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, సంస్కృతీ సంప్రదాయాల్ని కించపర్చేలా వ్యవహరించడం తగదని అన్నారు.రాత్రి వేళల్లో ఈ తరహా అసభ్యకరమైన కార్యకలాపాలు ఎక్కువ జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com