ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్
- October 02, 2020
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా నిర్ధారణ కావడంతో క్వారంటైన్‌కు వెళ్తున్నట్లు ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ సహాయకురాలు హోప్‌హిక్స్‌కు కరోనా సోకడంతో ట్రంప్‌కు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ట్రంప్‌తోపాటు మెలానియాకు కరోనా నిర్ధారణ అయింది. కాగా, హోప్‌హిక్స్‌తో కలిసి రెండు రోజుల క్రితం ఓ ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణం, మరోవైపు అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో ట్రంప్‌కు కరోనా వచ్చింది. అయితే చిన్న విరామం కూడా తీసుకోకుండా శ్రమిస్తున్న ట్రంప్ సహాయకురాలు హోప్ హిక్స్ కరోనా బారిన పడటంతో ట్రంప్ దంపతులకు పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ముందే ఎన్నికల వేడి ఉండటం, ట్రంప్‌కు కరోనా సోకడంతో పార్టీ వర్గాల్లో అలజడి నెలకొంది.
Tonight, @FLOTUS and I tested positive for COVID-19. We will begin our quarantine and recovery process immediately. We will get through this TOGETHER!
— Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన