ఐపీఎల్ 2020: చెన్నైతో రైనా, భజ్జీల అనుబంధం కట్..
- October 02, 2020
ఐపీఎల్ 2020లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ అనుబంధానికి శాశ్వతంగా తెరపడినట్టే కనిపిస్తోంది. వారిద్దరు మున్ముందు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ఇప్పటికే తమ అధికారిక వెబ్సైట్ నుంచి వారిద్దరి పేర్లను తొలగించిన ఆ ఫ్రాంచైజీ వారితో ఒప్పందాలనూ రద్దు చేసుకొనే ప్రక్రియను ఆరంభించిందని సమాచారం. నిబంధనల ప్రకారమే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు లీగ్ వర్గాలు అంటున్నాయి.
2018 వేలం మార్గదర్శకాల ప్రకారం రైనా, భజ్జీతో చెన్నై మూడేళ్ల కాలానికి ఒప్పందాలు చేసుకుంది. ఈ ప్రకారం 2020 సీజన్‌తో ఒప్పంద గడువు ముగుస్తుంది. వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ ఈ ఏడాది లీగ్ ఆడేందుకు నిరాకరించారు. దాంతో నిబంధనల ప్రకారం అధికారికంగా వారితో ఒప్పందాలు రద్దు చేసుకొనేందుకు యాజమాన్యం ప్రక్రియ మొదలుపెట్టిందని తెలిసింది.
ఏడాదికి రూ.11 కోట్లకు రైనా, రూ.2 కోట్లకు భజ్జీతో ఎన్. శ్రీనివాసన్ నేతృత్వంలోని ఫ్రాంచైజీ ఒప్పందాలు చేసుకుంది. ఈ సీజన్లో ఆడటం లేదు కాబట్టి అందులో కొంత డబ్బునూ చెల్లించడం లేదని సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన