కోవిడ్‌ 19 క్వారంటైన్‌ తప్పనిసరి

- October 02, 2020 , by Maagulf
కోవిడ్‌ 19 క్వారంటైన్‌ తప్పనిసరి

కతార్ కి వచ్చే ప్రయాణీకులందరికీ క్వారంటైన్‌ తప్పనిసరి అని కతార్‌ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కోవిడ్‌ 19 పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం అమల్లో వుందని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. కరోనాపై పోరులో భాగంగా ఏర్పాటు చేయబడిన స్టేట్‌ సుప్రీం కమిటీ, ఎరైవల్స్‌కి క్వారంటైన్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ నిబంధన అమల్లో వుంటుంది. పౌరులు అలాగే వలసదారులు యాంటీ వైరస్‌ ప్రికాషన్స్‌ పాటించాల్సి వుంటుంది. ఎక్కువమంది గుమికూడకూడదు. మాస్క్‌లు ధరించడం, సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించడం తప్పనిసరి. కాగా, ఖతార్‌లో ఇప్పటిదాకా 125,745 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com