హైదరాబాద్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆధునిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం
- October 03, 2020
హైదరాబాద్ లోని మల్లేపల్లిలో ఉన్న మోడల్ ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆధునిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ శనివారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఐటిఐ కోర్సు మొదటి నుండి చాలా ముఖ్యమైనదని అన్నారు. నేటి అభివృద్ధి యుగంలో కూడా దాని ప్రాముఖ్యతను ఎవరూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. 1954 వ సంవత్సరంలో ఈ ఐటిఐ కళాశాల స్థాపించ గా మొత్తం 28 ట్రేడ్‌లు ఉన్నాయ ని, 772 మంది విద్యార్థుల సంఖ్యను 892 కు పెంచారన్నారు. ఈ కళాశాలకు మోడల్ ఐటిఐ హోదా లభించిందని చెప్పారు. ఐటిఐ కోర్సులు భారతదేశంతో పాటు విదేశాలలో కూడా చాలా త్వరగా ఉపాధి కల్పిస్తాయని హోంమంత్రి చెప్పారు. విద్యా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతనిస్తోందని అన్నారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి కల్వకుంట్లచంద్రశేఖర్ రావు తెలంగాణ విద్యా రంగంలో పురోగతి సాధిస్తూ ఉన్నత విద్యను పొందేలా పథకాలు ప్రవేశపెట్టార ని, తెలంగాణ ప్రజలు ఈ సంస్థలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను విద్యావంతులుగా, నైపుణ్యం గలవారుగా మార్చాలని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సి.హెచ్. మల్లా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్లమెంటు సభ్యుడు జాఫర్ హుస్సేన్ మెరాజ్, ఐటిఐ డైరెక్టర్ కె. వై. నాయక్ నాయక్, ప్రిన్సిపాల్ రాధా కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







