తలనొప్పికి వంటింట్లోని కాఫీ పొడితో..
- October 04, 2020
తమలపాకు 4 ఆకులు తీసుకొని బాగా చూర్ణం చేసి రసం తీసుకోవాలి. రెండు కర్పూరం బిళ్లలు వేసి బాగా కలిపి నుదిటిపై రాయాలి. రాసుకున్న వెంటనే ఇబ్బందిగా ఉంటుంది. కొద్ది సేపటి తరువాత సర్థుకుంటుంది. వేధించే తలనొప్పికి ఇది ఒక చిట్కా. వంటకి వాడే అల్లం అందరి ఇళ్లలో ఉంటుంది. దీన్ని చిన్న ముక్క తీసుకుని నుదుటి భాగంలో రుద్దితే తలనొప్పి తగ్గుతుంది. రెండు చెంచాల ఆవాలు తీసుకొని పాన్‌లో వేయించాలి. ఆరిన తరువాత వాటిని పొడి చేసి అంతే మొత్తంలో బియ్యం పిండి కలపాలి. ఈ రెంటిని వేడి నీటితో కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి.
ఒక స్సూన్ మిరియాలు తీసుకొని కొద్దిగా కొబ్బరి నూనె వేసి మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని నొప్పి ఉన్న చోట రాత్రి పూట అప్లై చేయాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి. ముల్లంగి రసం క్రమం తప్పకుండా ప్రతిరోజు కొద్ది మోతాదులో తీసుకుంటే దీర్ఘకాలంగా వేధించే తలనొప్పి తగ్గుతుంది. అన్నిటి కంటే అమోఘమైనది అస్సలు ఊహించనిది కాఫీ పొడితో తలనొప్పి తగ్గడం.. మామూలుగా తలనొప్పి వస్తే ఓ కప్పు వేడి వేడి కాఫీనో, టీనో తాగితే తగ్గుతుందనే ఒక ఫీలింగ్‌లో ఉంటాము.. ఇది అందరూ చేసే పనే. కానీ అదే కాఫీ పొడితో ఆవిరి పడితే తలనొప్పికి అమోఘంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని బాగా మరగపెట్టాలి. ఈ మరిగిన నీటిలో 3 స్పూన్ల కాఫీ పొడి వేసి బెడ్‌షీట్ కప్పుకుని వేడి ఆవిరిని పీలుస్తుంటే తలనొప్పి తగ్గిపోతుంది. ఇలా 20 నిమిషాలు పడితే వేధించే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు