క్రికెట్ బెట్టింగ్ ముఠాని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీస్
- October 05, 2020
హైదరాబాద్:సైబరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. 22 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకోగా, తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. సీపీ సజ్జనార్ మీడియాకు వివరాలను వెల్లడించారు. చందూర్ శశాంక్ అనే ప్రధాన బూకీతో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. భర్కత్ అనే ప్రధాన బుకీ పరారీలో ఉన్నాడని, మొబైల్ ఫోన్ లోనే ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు.
బెట్ 365, డ్రీం 11, ఎంపీఎల్, బెట్ వే, డ్రీంగురు, మై 11 సర్కిల్, బెట్ 365, కోరల్, బివిన్, 777 బెట్, డెఫాబెట్, విన్నర్, క్రికెట్ బెట్టింగ్ 2020, జస్ట్ బెట్, బెట్‌ఫ్రడ్, లోటస్ క్రికెట్ లైన్ తదితర మొబైల్ యాప్‌లలో వచ్చే రేటింగ్‌లు ద్వారా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఎవరికైనా బెట్టింగ్‌లకు సంబంధించిన సమాచారం తెలిస్తే 9490617444 నంబర్‌కు కాల్ చేయాలని సీపీ విజ్క్షప్తి చేశారు. ‘‘స్టూడెంట్స్ ఎక్కువగా బెట్టింగ్‌లలో పార్టీసిపెట్ చేస్తున్నారు. డబ్బు ఎవ్వరికీ ఊరికే రావు. కష్టపడాలి. రాత్రికి రాత్రే శ్రీమంతుడు అవ్వాలనుకోవడం కరెక్ట్ కాదు. బెట్టింగులకు నగర యువత దూరంగా ఉండాలని’’ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన