రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువ క్రికెటర్..
- October 06, 2020
అఫ్ఘానిస్తాన్ ఓ యువ క్రికెటర్‌ను కోల్పోయింది. గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్ నజీబ్ తర్కారీ చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచాడు. జలాలాబాద్‌లోని ఈస్టన్ నంగ్రహార్‌లో రోడ్డు దాటుతున్న సమయంలో తర్కారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడు కోమాలోకి వెళ్లాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. తర్కారీ మరణించిన విషయాన్ని అప్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
తమ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, మంచి వ్యక్తిత్వం ఉన్న నజీబ్ తర్కారీ (29) మరణం పట్ల అప్ఘాన్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది.నజీబ్ తర్కారీ 12 టీ 20, ఒక వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.కుడిచేతి వాటం కలిగిన బ్యాట్స్‌మన్ నజీబ్ 2014 బంగ్లాదేశ్‌లో జరిగిన టి 20 ప్రపంచ కప్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతడి అత్యధిక అంతర్జాతీయ స్కోరు 90, ఇది మార్చి 2017 లో టి 20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో ఐర్లాండ్‌తో తలపడింది. తర్కారీ చివరి అంతర్జాతీయ ప్రదర్శన 2019 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!