పెళ్లి ఖరారు అంటున్న కాజల్

- October 06, 2020 , by Maagulf
పెళ్లి ఖరారు అంటున్న కాజల్

తెలుగుతెర చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి ముహూర్తం ఖరారైంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ తో కాజల్ పెళ్లి నిశ్చయమైందని తన పెళ్లి గురించి వస్తున్న వార్తలను ధ్రువీకరిస్తూ మంగళవారం ఉదయం కాజల్ అగర్వాల్ ట్వీట్ చేశారు.

తాను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించానని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. అక్టోబర్ 30న కుటుంబ సభ్యులు పెళ్లి వేడుక జరుగుతుందని ఆమె వెల్లడించారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత కూడా తనకు ఎంతో ఇష్టమైన, తనకు అమితానందాన్ని ఇచ్చే నటనను కొనసాగిస్తానని కాజల్ స్పష్టం చేశారు. దీన్ని బట్టి పెళ్లి తర్వాత కూడా కథానాయికగా సినిమాలు చేస్తారని ఆశించవచ్చు.

కాజల్ పెళ్లి వేడుకకు ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ ను వేదికగా ఎంపిక చేశారని సమాచారం. అయితే ఆ విషయం కాజల్ చెప్పలేదు. రెండు రోజులపాటు కాజల్ పెళ్లి వేడుకలు జరుగుతాయని సమాచారం. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ ఆల్రెడీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com