రియాచక్రవర్తికి బెయిల్ మంజూరు
- October 07, 2020
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియాచక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె సోదరుడు షౌవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులో ... ఆ ఇద్దరినీ NCB అధికారులు సెప్టెంబర్ 9న అరెస్టు చేశారు. ఇదే కేసులో అరెస్టైన శామ్యూల్ మిరిండా, దీపేశ్ సావంత్లకూ.. కోర్టు బెయిల్ ఇచ్చింది. మరో డ్రగ్ పెడ్లర్ అబ్దుల్ బాసిత్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు వ్యతిరేకించింది. ముంబైలోని బైకుల్లా జైల్లో ఉన్న రియాకు.. దాదాపు నెల రోజుల తర్వాత బెయిల్ మంజూరైంది.
తనకు ఉన్న మాదకద్రవ్యాల అలవాటను కప్పిపుచ్చుకునేందుకు సుశాంత్ సింగ్.. తనను పావుగా వాడుకున్నట్టు... రియా తన బెయిల్ పిటిషన్లో పేర్కొంది. తన సోదరుడు షౌవిక్‌ను కూడా సుశాంత్ టార్గెట్ చేసినట్టు రియా పేర్కొంది. మరోవైపు... ఈ కేసులో నిన్ననే ప్రత్యేక కోర్టు రియా జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు పెంచింది. ప్రస్తుతం బెయిల్ లభించడంతో.. రియా జైలు నుంచి బయటి ప్రపంచంలోకి రానుంది.
రియా వాట్సాప్ మెసేజ్‌ల ఆధారంగా NCB ఆమెను... అరెస్టు చేసింది. డ్రగ్స్ సిండికేట్‌లో రియా యాక్టివ్ సభ్యురాలిగా ఉన్నట్టు... ఎన్సీబీ ఆరోపించింది. డ్రగ్స్ సరఫరా కోసం ఆర్థిక లావాదేవీలను రియా చూసినట్టు ఆరోపణలున్నాయి. అటు.. రియాతోపాటు సుశాంత్ మేనేజర్ సహా పలువురి వాట్సాప్ చాట్ల ఆధారంగా ప్రముఖ నటీమణులు రకుల్ ప్రీత్‌సింగ్, దీపికా పదుకునే, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌లను NCB అధికారులు విచారించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన