కొత్త యాజమాన్యంపై 3,000 మంది యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ ఉద్యోగుల ఆశలు

- October 08, 2020 , by Maagulf
కొత్త యాజమాన్యంపై 3,000 మంది యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ ఉద్యోగుల ఆశలు

దుబాయ్‌: యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ సెంటర్‌లో పనిచేస్తోన్న 3,000 మంది ఉద్యోగులు కొత్త యాజమాన్యంపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. తిరిగి తమ ఉద్యోగాల్లో ఆనందం కనిపిస్తుందని వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న నాలుగు వారాలూ యేఏఈ ఎక్స్‌ఛేంజ్‌కి అత్యంత కీలకమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్‌కి చెందిన ప్రిజ్మ్‌ అడ్వాన్స్‌ సొల్యూషన్స్‌కి విక్రయించడంపై ఫినాబ్లర్‌ బోర్డ్‌ నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఈ మెర్జ్‌ అనేది జరిగితే, యూఏఈలో అతి పెద్ద కార్పొరేట్‌ రెస్క్యూ యాక్ట్‌ అవుతుందని ఈ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 100 ఔట్‌లెట్స్‌ యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌కి వుండగా, దాదాపుగా అన్ని చోట్లా ఆపరేషన్స్‌ నిలిచిపోయాయి. కొన్ని బ్రాంచ్‌లలో మాత్రం కన్స్యుమర్‌ క్వరీస్‌ని డీల్‌ చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో చాలా వరకు ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ కూడా గందరగోళంగా మారిన దరిమిలా.. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఈ రంగంలో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. కాగా, ఔట్‌లెట్స్‌ అన్నీ తిరిగి ప్రారంభమవుతాయా.? లేదా.? అన్నదానిపై ఉద్యోగుల్లో కొంత గందరగోళం కొనసాగుతోంది. కొత్త ఉద్యోగుల్ని తీసుకుంటే, తమ పరిస్థితి ఏమవుతుందనే ఆందోళన కూడా చాలామందిలో వుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com